పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

    మావంశనృపతుల మహిమ సూహించి నేఁ
              బరవశత్వమున మైమఱచుచుందు
              
గీ॥ నట్టివిశ్వోన్నతంబైన యన్వయమున
    కకట! యేనీచుఁడైన దుర్యశముఁ గూర్పఁ
    బూనినను బ్రాణములతోడఁ బోవఁగలఁడె
    వ్రక్కలై శీర్షమది నేల వ్రాలుఁగాక. 292
    
సీ॥ అప్రతిహతముగా నక్బరొక్కఁడె యేల
             క్షితిని దేవుఁడు సృష్టి సేయలేదు;
    వితత ప్రజాకోటి యతనిచేఁ దునుమాడఁ
             బడుటకై పుట్టింపఁ బడఁగ లేదు;
    సకల భూపాల కన్యక లాఘనుని భోగ
             పరత కుద్దేశింపఁ బడఁగలేదు;
    ధరణీశులెల్ల నాతనిఁజేరి కొలిచి పా
              దములొత్తఁ బుట్టువం దంగలేదు;
              
గీ॥ తనయొకని రాజ్యతృష్ణకై ధరణిఁగలుగు
    ప్రజయు స్వాతంత్య్రమును బాసి పారతంత్య్ర
    మున మునుఁగుటెల్లఁ బాడిగా దనుచు నక్ప
    రెంత యెఱిఁగిన జగమున కంత మేలు. 293
    
మ॥ "అకటా! కష్టము: నాకుఁదోడుపడుమీ;" యంచొక్కనిన్ వేఁడుపా
     తక మేనేరను; మీఁదు మిక్కిలి భవత్సాహాయ్యమున్ నాదు కు
     త్తుకయున్ బోయెడు నప్పుడైన నడుగ౯; దొల్గొల్తఁ దౌరుష్కు నిం
     టికి నిన్నిల్లట పల్లుగావిడిచి, పాడికాదప్పి వర్తింతునే. 294 294
     
సీ॥ తెఱవ లఖండ పాతివ్రత్య బలమున
         జ్వలదగ్ని శిఖల ఠేవను రహింత్రు
    పురుషులు వీరధర్మ రసావతారులై
         వితత ఘోర శతఘ్ని పిండములటు
    లొక్కొక్క రొక దుర్గమోయన నుందురు;
         వైరులదృష్టి మేవాడ సీమ