పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

153

    బ్రహ్మాండమంత విపత్తు వచ్చిననోర్తు;
               నించుకయేని జింతించఁబోను:
    మఱి నెందుఁగాని నిర్మాణమ్మునకు ముందు
               విధ్వంసనము ముఖ్య విధిగనుండుఁ
    బరతంత్రగతినొందు వైభవంబున కన్న
               స్వాతంత్య్రమున వచ్చు చావుమేలు;
               
గీ॥ మాశిశోదియా వంశ సంభవులు బ్రదికి
   స్వేచ్ఛమై నుండవలె లేనియెడలఁ జచ్చి
   స్వర్గముననైన నుండఁగా వలయుఁ; గాని
   మధ్య వేఱొండు మార్గంబు మాకులేదు.290
   
సీ॥ ఆర్తరక్షణము చేయఁగబూని మేని కం
               డలుచెండి యిచ్చు విజ్ఞాననిధులు
    సత్యంబుకొఱకు యోషాపుత్రకుల నమ్మి
               మాలనిఁ గొలిచిన మానధనులు
    పితరులకై పూని క్షితియెల్ల మేలొంద
               స్వర్గంగఁ దెచ్చు దీక్షానిరతులు
    జనకాజ్ఞకై పెక్కు సంవత్సరములు అర
               ణ్యములఁ గష్టములొందు విమలయశులు
               
గీ॥ భానుకులమునెకాక సర్వప్రపంచ
    మును యశశ్చంద్రికలఁ బూఁత పూయఁ గలిగి
    రట్టి పూర్వుల దొడ్డపేరగ్గిఁ గలుప
    నోర్తునే ప్రాణముల వీడ నేర్తుఁగాక. 291
    
సీ॥ మానసింహా! యభిమానసింహుఁడవు గా
            కగునని యిట్లాడఁ దగునెనీకు?
    నుర్వి యెప్పుడు పుట్టెనో యప్డె మాభాను
            వంశంబు ప్రభవించి వాసిఁగాంచె
    నెన్నియుగంబులో' యెన్ని యుద్ధంబులో
            యిందాఁకఁ దలవంప కెత్తి నిలిచె