Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంగదుం బిలిచి నీవు రావణుసమీపంబునకుం బోయి నావచనంబులుగా నతని
తోడం బలుకునప్పలుకులు విను మనుచు ని ట్లనియె.

499


మ.

కడిమిం బోరికి శూరతం గడఁగి రా కాదేని వైదేహి నేఁ
గడవం దెచ్చితిఁ దప్పు గావు మని లంకారాజ్య మొప్పించి వె
ల్వడి ప్రాణంబులు గాచికొంచు దివిజు ల్సంతోషముం బొంద నె
య్యెడ కైనం జను మావిభీషణుఁడు రా జివ్వీటికిన్ రావణా.

500


చ.

కపటము పన్ని జానకి నకల్మషఁ దెచ్చినయట్టిపాపక
[1]ర్మవుఁబొడువం దనూజహితమంత్రిసమేతముగా దశాస్య మ
ద్విపులశిలీముఖజ్వలనదీర్ఘతరార్చుల నేర్తు నిన్ను నీ
తపమున కట్లు [2]మెచ్చినవిధాతృఁడు వచ్చిన నెందుఁ జొచ్చినన్.

501


వ.

అనిన విని తారానందనుండు తారాపథంబున కెగసి రెండవవైశ్వానరుండునుం
బోలె మండుచుం జని నిశాచరు లచ్చెరు వంది చూచుచుండఁ బౌలస్త్యునాస్థాన
మంటపంబున డిగ్గి సాహంకారుం డగుచు నాదశకంధరు నవలోకించి.

502


చ.

చెఱ నిడి నీమదం బడఁగఁ జేసినయర్జునువేయిచేతులు
నఱకి భుజావిజృంభణమునందుఁ బేర్చినజామదగ్న్యువిల్
విఱిచిన రాముబంట వినవే నను నంగదు సర్వగర్వమున్
నెఱి సెడ నాల్గువారిధుల ని న్నటు ముంచినవాలిపుత్రుఁడన్.

503


వ.

అని పలికి రఘువరుండు దనవచనంబులుగా నీతోడ నాడు మన్నవచనంబులు
వినుము.

504


మ.

కడిమిం బోరికి శూరతం గడఁగి రా కాదేని వైదేహి నేఁ
గడవం దెచ్చితిఁ దప్పు గావు మని లంకారాజ్య మొప్పించి వె
ల్వడి ప్రాణంబులు గాచికొంచు దివిజు ల్పంతోషముం బొంద నె
య్యెడ కైనం జను మావిభీషణుఁడు రా జివ్వీటికిన్ రావణా.

505


చ.

కపటము పన్ని జానకి నకల్మషఁ దెచ్చినయట్టిపాపక
ర్మపుఁబొడువం దనూజహితమంత్రిసమేతముగా దశాస్య మ
ద్విపులశిలీముఖజ్వలనదీర్ఘతరార్చుల నేర్తు నిన్ను నీ
తపమున కట్లు మెచ్చినవిధాతృఁడు వచ్చిన నెందుఁ జొచ్చినన్.

506


వ.

అని పలికిన.

507


శా.

భుగ్నభ్రూకుటిభీకరుం డగుచు నాస్ఫోటించి బాహార్గళా
లగ్నక్రూరతరోరుఖడ్గరుచిజాలంబుల్ గదావిస్ఫులిం
గాగ్నిజ్వాలలు గన్ను లీనికొన లంకాధీశుఁడుం గ్రోధని
ర్మగ్నుం డై వడి వీనిఁ బట్టుఁ డనఁగా రాత్రించరుల్ బల్విడిన్.

508
  1. ర్మపుఁబొడవుం
  2. మెచ్చినవిధాతృనిఁ జొచ్చిన నెందుఁ