Jump to content

శ్రీనాథకవి జీవితము/అష్టమాధ్యాయము

వికీసోర్స్ నుండి

అష్టమాధ్యాయము


అవసానకాలము

శ్రీ నాథకవి సార్వభౌముడు తన వార్ధక్యమునఁ బయి నుడివిన కష్టము లనుభవించి ప్రాణావసాన సనుమమున


 సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరా రెడ్డి
రత్నాంబరంబు లేరాయఁడిచ్చు
రంభఁగూడె దెనుంగురాయ రాహుత్తుండు
కస్తూరి కేరాజ ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండెమెలారు విభుడేగి:
దినవెచ్చ మేరాజుతీర్పఁగలఁడు

గీ.. భాస్కరుఁడు మున్నె దేవుని పాలి కరి గెఁ
గలియుగంబున నిక నుండ: కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనఁగ
నరుగు చున్నాఁడు శ్రీ నాథుఁడమర పురీకి. "


అని యెల్ల వారికి జాలిపుట్టునట్లుగాఁ బయి సేసవద్యమును జెప్పి విచారముతోఁ బ్రాణములను విడిచెట, దీనిని సందు చేసికొని విషయవిమర్శను జక్కఁగాఁ జేయక ప యధ్యాయమున నుదహరించిన కవిరాజు కంఠంబుఁ

గౌగలించెనుగదా వురవీధి నెదు రెండ పొగడదండ ,

అను పద్యమును నిందలి పై సీసపద్యమును దాహరింపుచు శ్రీవీరేశ లింగము పంతులుగారు తష ఆంధ్రకవుల చరిత్రమునందు

"అవసానదశయం దిట్టికష్టములకెల్లను గారణము యౌవనదశ యందుఁ గామవశముచేత స్వేచ్ఛముగా విహరించి దేహమును ధన

మును బోఁగొట్టుకొన్న పాపఫలముతక్క వేటొక్కటి గానరాదు ,,

అనియొక యపూర్వ వ్యాఖ్యానము చేసి ధర్మోపదేశమగావించి యున్నారు.

ఈ చాటుపద్యములు రెండును శ్రీనాథకవియే మనము విశ్వసించిన యెడల మొదటి పద్యము చెప్పిన కాలమునకును రెండవ పద్యము చెప్పిన కాలమునకును నడుమ గొంత కాలము గడచిఁ యుండ వలయును. ఏకకాలమనఁ జెప్పినవి కావనుట సత్యము.

శ్రీనాథుఁడు కీ శ. 1360 లోఁ బుట్టి శ్రీశ. 1440 లో మృతినొందెననియు నప్పటికీ 80 సంవత్సరముల వయస్సుగలవాఁడైయుండునని లక్ష్మణ రావు గారును, (1365 లో బుట్టి 1440- 45 లో 84 సంవత్సర ప్రాంతముల మరణముఁ జెందెనని, వీరేశలింగము పం తులుగారును. సిద్ధాంతములు చేసి యున్నారుగదా! అనఁగా శ్రీనాథురకు 60 సంవళ్ళగము » వచ్చు వఱకును వీరభద్రా రెడ్డి బ్రదికి యున్న వాడు గావున సంతవఱ కిట్టి నష్టము శ్రీనాథునకు సంభవింప లేదనియు నటు పిమ్మటనే యీతఁడిట్టి కష్టములను బొందెననియు, దేటపడుచున్నది. పంతుల వారీ యభిప్రాయము ననుసరించి యెనుబది యేండ్లు దాటిన ముసలితొక్కు ఒక గ్రామమును గుత్త కుఁ గొనుటయుఁ వ్యవసాయము చేయుటయు వఱదలు వచ్చి పంటల గొనిపోవుటయు ఏడునూర్లటం కంబులు పన్ను చెల్లింప లేక పోవుటయు, ఎండలో నిలువఁ బెట్టబడుటయు బొండవేయుటయు, నగరి వాకిట నుంము సల్లగుండు భుజముపైఁ బెట్టు టయు సంభవించెనన్న విశ్వసింపఁదగునా ? కాటికి గాళ్ళు చాచుకొని యొక మూల ప్రాణములను విడుచుచు నాకు రత్నాంబరములు కావ లెననియు, కస్తూరి కావలెననియు, హేమపాత్రాన్నము కావలెనవియు, దినవెచ్చము గావలెననియు, శ్రీనాథునివంటి వేదాంతియుభక్తాగ్రేసరుఁడును నేడ్చెనన్న విశ్వసి పవచ్చునా? స్త్రీలోలుడై వయః

కాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధనని కాయమును, జెడగొట్టుకుని కష్టపడవలసిన , వృద్ధదశను దెచ్చుకొన్నాడట! ఎంతటి సాహనపుం బలుకు? ఇట్టి తోరపుం బలుకు పలుకుటకుఁ గారణంబేమి? వీథి నాటకములోనిదానివలె దుర్జయపోషణమునకు గాక యుగయశోషణ మునకును , నీతిభంజనమునకు గాకదుర్నీతి భంజనము నకును, 'ఉద్దేశింప బడెనని మా మిత్రులెలుగుదురు గాక!" అని వ్రాయుట చేత వీథనాటక మొక కారణముగా దెలుపఁబడు చున్నది. వీరి యభిప్రా యము వీధినాటకముసఁ గ్రీడాభిరామమని గాదు. శ్రీనాథుఁడు వేశ్యాప్రియుఁడని యాతనిని గూర్చి వ్రాసిన వారందఱును నైశకంఠ్యముతో జెప్పుట రెండవ కారణమట! వీధినాటక మను పేరితో బజాఱులో నమ్మబడు గ్రంథము కు శ్రీనాధ విరచిము గాదనిన మంగోదరి యాంధ్రుల చరిత్రలోని దివఱకే వ్రాసి యున్నాను. వీరేశలింగముగారే శ్రీనాశ్రీనాథుడు వీధినాటక మనబడెడి యొక యపాత్రపు గ్రంధమును గూడఁ జేసెనని చెప్పుదురు గాని యిప్పుడు ప్రకటింపబడియున్న యా పేరటి చిన్న పుస్కమాతనిచే ఫుస్తకరూపమున రచింప బడినది కాదు. ........ దుర్నీతి పోషకమైన పద్య రూపమును శ్రీనాథుని కారోపించుట యూతని పకీర్తి కలిగించుట , శ్రీవాధుని వీధినాటక ముని ప్రకటింపబడిన దానికి. .వీథిరూపక లక్షణమే . .... .... పట్టదు. దీనివలన వీథి కై శికీ ,వృత్తియందు రచియింపఁ బడిభాణము నందువల్లె సంధ్యా గాంకములను గలదయి అధికముగా శృగార రసమును కొంచెముగా నితరరసములను గలిగి ఉద్ఘాత్యకాద్యంగములతో ప్రస్తావనను గలిగి, పొత్రముల నొకటీ రెంటిని గలదయి యుండవ లెనని యేర్పడుచున్నది ... .... ఈ యేర్పడిన లక్షణములేవియు లేవు. ఇందు నాయకుఁడు లేడు; ప్రస్తావన లేదు; పొత్రములు లేవు సంధులు లేవు ఇతివృత్తము లేవు వీథికుండ వలసిన యంగములే

38

వియు లేవు ... ... ఈ యసభ్యత గ్రంథము యొక్క కర్తృత్వము నూరాక యారోపించి మనవారు కొందు శ్రీనాథుమి ముంపఁ దలచుకొన్న దుర్యశః పంకము నుండి యక్కడి శ్రీ నాథకవి కృతము గాదని సిద్ధాంతమై సప్పుడే లేచి నిలఁబడి గట్టెక్కి కృతార్థుఁడు కాఁగలుగును : అని కంఠోక్తిగా వీథి నాటకము శ్రీ నాథవిరచితము కాదని సిద్ధాంతీ కరించియు "తమగ్రంధములలోని శృంగారమును, దుర్వర్తన ప్రకట టనముకును, 1: వీధినాటక ములోని (శ్రీనాథుని దానివలె దుర్జయపోషణ మునకును నీతిభంజనమునకును గాక దుర్జయశోషణమునకును దుర్నీతి భంజనమునకును , ఉద్దేశింపఁబడె'నని వ్రాసి వీధి నాటకము కారణముగా జెప్పుట స్వవచన వ్యాఘాకము కాదా? శ్రీనాథుని , జారుడఁ నుటకు సాక్ష్యము గలదా? వారు వీరు వ్రాసినారని యదియొక. ప్ర మాణముగాఁ గైకొనుట శాస్త్రీయ ధర్మమగునా? 4, ఇతడు శివభక్తుడు యావనదశ యందు శృంగార నాయకుడై స్త్రీలోలుడై తిరిగెని చెప్పదురు. అదంతయు నిజమ్మోకాని వయసు ముదిరిన తరువాత శివభక్తుడై యుండెనని యాతడు రచించిన గ్రంథములే సహసముఖముల ఘోషించుచున్న వి., అని పంతుల గారు తాము వ్రాసిన వాక్యములలో శ్రీనా థుని యౌవనదశను - గూర్చి తమ కేమియుఁ దెలియదని యొక మూల ఘోషింపుచు " స్త్రీలోలుఁడై వయః కాలమున విచ్చలవిడిగా దిరిగి కాయమును ధననికాయమును జెడగొట్టుకొని కష్టపడవలసిన వృద్ధదశ ను దెచ్చికొన్న పాపి యని సిద్ధాంతీకరించుట శ్రీనాథకవి సార్వభౌము నిపట్లఁ జూపు దౌర్జన్యమని వేనోళ్లఁ జూటకుండునా? వీరు క్రీడాభిరామ ముం సయితము శ్రీనాథకవి విరచితము కాదని చెప్పుచున్నారు. శ్రీనాథు నిపై మోపఁబడిన దోషము స్త్రీవర్ణననములు చేసినందులకును విటపురుషుల దిర్వర్తనముల వెల్లడించినందులకు కాదట. 'ఇంకెదులకందురా? శ్రీనాథుడు వేశ్యాజనవర్ణ నకుజనవర్లనము విశేషముగాఁ జేసినం

దుసకఁట, క్రీభిబిమముము శ్రీనాథ విరచితము కాదని తాము 'స్థిరీకరించియుండియు మానవల్లీ రానుకృష్ణకవిగారు. క్రీడాభిరామపీఠిక లో నక్షయ్యంబుగ' అను పద్యము నుదాహరించి యాసందర్భమున దీనిచే శ్రీ నాథునకు దాక్షారామ వేశ్యలతో సంబందము గలదని వేఱుగ జెప్పనక్కర లేదు. వీధి నాటకములోని చిన్న పోతియే శ్రీనాథునకుఁ గూర్చుమగువయోయని సందియుము: గలుగుచున్నది.' ' అని వ్రాసినారనిరి. మొదటిది చాటువు వారి యభిప్రాయము ప్రకారమురెండవది శ్రీనాథ విరతము కాదు, రామకృష్ణకవి రీయూహూ వీరి కెట్లు పరమప్రమాణమయ్యెనో యూహింప నలవిగాదు; నమ్మినయెడల నీట్టి పిచ్చికథలు పెక్కులుగలవు. వీటికి దలయఁ దోకయ నుం డవు . శ్రీనాథకవి చేసిన : శ్యానర్న నాదులనుబట్టి యిదంతయుఁ గల్పన చేసినారు గాని ఱొండు గాదు. పూర్వకవులు చేసిన ' వర్ణనలను బట్టి వారి యొక్క వర్తనములను నిర్ణయింప రాదు, అందు చేతనే నేనాంధ్రుల చరిత్రములో . ఇట్టి సిద్ధాంతమునే మనము సాహసించి చేయువలసిన పశమున లోకములో సిగ్గును విడనాడి ప్రబం దములలోఁ గామోద్రేకముగలిగించు విధమున మిక్కిలి పచ్చిగా స్త్రీ వర్ణనకులు గావించి రసికజనమనోరంజనము గావించెడు కవులను, లోకములోని విటవురుషుల దుర్వర్తసముల హాస్య ప్రబంధరూపమునను ప్రహపన రూపమునను వెల్లడించెను. కవులను, కామపరవశులనియు, వారలు శ్రీనాథునికంటే ఘనులు కౌజూలరనియు మనము సిద్ధాంతము చేసి చెప్పవలసి వచ్చును గదా!” అని 'నేను వ్రాసి - యున్నాను., 1. గుమ్మడి కాయల దొంగయన్న బుజము తడివి డివిచూచుకొన్న వానిపగిది తమ్మును తమ గ్రంథములను బేర్కొన్న వాడనని యహంకారమసుబూని నావాక్యములో మొదటనున్న "ఇట్టి సిద్ధాంతమునే మనము సాహసించి చేయవలసిన పక్షమున లోకములో సిగ్గుమ

విడనాడి ప్రబంధములలో" అన్నంతవరకును, వాక్యములో గడపట నున్న వారలు శ్రీనాథు కంటె ఘనులు కాఁజాలగనియు సిద్ధాంతము చేసి, అన్నంతవరకును దీసి వేసి తక్కినదాని నుదహరించి ద్వేషబుద్ధి, దురభిమాన పూరితములైన యుక్తి రహిత దూషణ భాషణములను వ్రాసి యున్నా'నని నాకు ద్వేషబుద్ధి నారోపించి నన్ను నిందించి తమగ్రంథములను శ్లాఘించుకొనుచు శ్రీనాథుని నోటికి వచ్చి నట్లు బడబడఁ దిట్టి వేసినారు మనము సాహసించి వీరేశలింగముగారు చేసిన సిద్ధాంతమునేచేసిన పక్షమున ప్రబంధక ఫులను, ప్రహసనకవు లను నట్టే భౌ"వింపవలసి వచ్చుననియు, వారలు శ్రీనాథునికంటె ఘనులు కాజాలరని చెప్పవలసివచ్చుననియు, గౌవున నట్టి సిద్ధాంతము చేయరాదనియు నాయభిప్రాయమును దెలుపుటకట్లు వ్రాసి యున్నాను "ప్రబంధములు కవులు" అని బహువచన ప్రయోగము చేసి వ్రాసి యున్నను' విస్మరించి రసిక జన మనోరంజనము గావిం చెడు కవి తా మొక్కరే యనుకొని తమగ్రంధము సర్వకళాశాల హారిచే ప్రథను శాస్త్ర పరీక్షకును శాస్త్రపాధ్యాయ పరీక్షకును పఠనీయ గ్రంథముగా నిర్ణయింపఁబడెనని యొక గొప్పగా సెంచుకొనుచున్నారు. ఇవి వీరికి గొప్ప యైన యెడల శ్రీనాథుని 'కాలములోని మహారాజు, చక్రవర్తులు,వాని గ్రథములను బూజించి వానికి గన కాభిషేకము చేసి యుండలేదా? వీరి శృంగారము వేరాట. వేశ్యాంగనా వర్ణన మైన నేమి? ,, పదిప్రతి వాతాంగ సానర్జనమైననేమి? హద్దు మీఱి వర్ణింపఁబడిన శృగారవర్ణ నములు కామోద్రేమును బుట్టించుటకు రెండు సమానము లేయగుచున్నవి " ఏ కాలమునందును హిందూ సంఘము జారత్వము ' ప్రతి ష్టానహమైనదిగను, శ్లాఘ్యమైనదిగసు బరిగణింపఁబడి యుండ లేదనియు అసభ్యములగు - స్త్రీ వర్ణనములు శ్రీనాథుని గ్రంథములందున్న వని భావించిన యెడల నట్టివర్ణనము లుత్తములని" భావింపఁబడు " వారి కావ్య ములలో గూడ గలవనియు,ఇంతగా నధిక్షేపించెడు వీళేశలింగముగారి గ్రంథములనుండియు నెత్తి చూపించవచ్చుననియు విశదపఱచుకొనుచున్నాను.


ఎట్లయినను అవసాస కాల మాసన్న మగునప్పటికి మనకవిసార్వ భౌముడెనుబది సంవత్సరములు వయస్సు గలవాడై యున్నట్టు యొప్పు కొనక తప్పదు 1447 వ సవత్సరము నాటికి రాజమహేంద్రపు రాజ్యము గజపతుల యధీనమై పోయినది. శ్రీ నాథునకాంధ్ర ప్రభువుల ప్రాపు తొలగిపోయినది. తరువాత నొకటి రెండు సంవత్సరములు డాటిన వెనుకనే 1450 సంవత్సరముల ప్రాంతమున డెబ్బ దేండ్ల ప్రాయమునాఁడు గత్యంతరము లేక బొడ్డుపల్లెను గుత్త కు దీసికొని వఱదలు మొనలగు వానివలన పంటలు నాశనము కాగా గుత్త పైకమునుగూడ చెల్లింప లేక నర ప్రభువులవలన మొదటి పద్యములో జెప్పఁబడినట్టు నానావిధకష్టములు పొందియుండి యాపద్యసును జెప్పి యుండను. దీని దైవికముగా భావి పవలయునే కాని స్త్రీలోలుఁడై వయః కాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధనని కాయమును జెడ గొట్టుకొని వృద్ధదశను దెచ్చుకొస్న పాపఫలనుని నిందించివ్రాయుట యెట్టివారికిని ధర్మమును గాదు; న్యాయమును, నీతియునుగాదు.

ఈ పద్యము చెప్పిన వెనుక మఱికొన్ని సంవత్సరములయినను బ్రతికి యుండడ వలయును. ఇతడు 1460 వఱకు బ్రతికి యుండ వలయునని నేనభిప్రాయపడుచున్నాను,


ఇట్లు నలుబది సంవత్సరముల కాల మఖిండ వైభవ , మనుభ వీంచి 'కాలకర్మదోషమువలన దారిద్రము పాలయి ". యెనుబదేండ్ల 'ప్రాయమున బ్రాణములు విడుచుచు శ్రీనాథుఁడు కనిసౌర్వభౌముఁ డు" గావున దన తొల్లింటి వైభవమును నప్పటి కష్టస్థితిని సూచిం పును నాత్మ గౌరవముతో గూడుకొన్న గాంభీర్య.. భావమును వెల్ల డించుచుఁ గవితాచాతుర్యము గలిమి చూపుచు దివిజ కవివరు • గుండి యల్ దిగ్గురనగ' సరుగు చునాఁడు శ్రీ నాథుడమరపురికి ". అని చెప్పిన పద్యమై యుండవలయునే గాని యేనబదేండ్లు నిండియు వైషయిక వాంఛల విడవజాలక వానికై యంగలార్చుచుఁ జచ్చు చున్నపు' డు భావిప్రపంచమున కుహనావి కుర్శకులు దన్ను నోటికి వచ్చినట్లు గా డిట్టుటకై చెప్పిన పద్యము గాదని కవితావాసన యించుక యేని గలవారికి బొడగట్టక మానచు


నవమాధ్యాయము.


శ్రీనాథుని ప్రవర్తనము


మా మిత్రులగు శ్రీయుత వేటూరి ప్రభాకరశాస్త్రి గారుతమ శృంగార శ్రీ నాథమను గఁథమున శ్రీవీరేశ లింగము పంతులుగారీ సందర్భమున శ్రీనాథుని గొంత' యవగణిచిరి. అతఁడు వార్ధకమున దారిద్ర మనుభవించుట పాపఫలమని కర్మ పాకము చెప్పిరి, అట్లు చెప్పుట వారికే చెల్లినది.” అని వ్రాసి వారి యభి ప్రాయము దాము గుర్హించినట్లు,తోప జేసిరి. ఎద్దానిఁబుక్రస్కరించు కొని వీరేశలింగము - పంతులవారట్లు '.. వ్రాయసాహసించిరో యద్దానినే మాశాస్త్రుల వారును బల పఱుచున్నారు. వీరివ్రాత వైఖరిని.. చూ డుడు