Jump to content

పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16


రాజ్యాంగమందు మార్పులు చురుకుగా ప్రారంభమయ్యెను. ఆ కాలములో రాజ్యములో నాలుగు విభాగములుండెను. ప్రతి భాగమునకును ఒక పోలీసు సదర్ మోహ తెమీం ప్రధా నాధికారిగా నుండెను. పోలీసు సిబ్బందికి యూనిఫారం లేకుండెను. కొందరు ధోవతులను, కొందగు పటాలను, కొందరు కోట్లను ధరించి, చేతులలో కట్టెలనో లేక కత్తులనో పట్టి ఉద్యోగములు చేయుచుండిరి. సదర్ మొహ తెనాం గారి సేనలో ఒక ఏనుగుకూడ నుఁడుచుండెను. నెలలపర్యంతము వీరు దౌరా చేయుకుండిరి. ఎప్పుడైన దౌరా చేయ సంకల్పించిరా వారు ఏను గుపై సవారియై ముందు పోలీసు సిబ్బంది, అరబ్బులు, రోహిలాలు, నడుచుచుండగా మేళ తాళములు బాజా భజంత్రీలు, డప్పులు, వాయించు చుండగా తుపాకులు పేల్చుచు, ఒక పెండ్లి ఊరేగింపువలె బయలు దేరుచుండిరి. ఒక సదర్ మొహతే మీం బైంగన్పల్లి నవాబుగారి ఎంశీయులై యుండిరి. వారికి బహిరీ పిట్టల యొక్కయు, చిరుతపులులయొక్కయు, వేట చాలాయిష్టము. వారి దౌరా అనిన షికారీ అనియే యర్ధము. అడవులలో డేరాలు వేసి అచ్చటికే గ్రుడ్లు, పెట్టలు, భోజన సామగ్రి వెట్టి పట్టి తెప్పించెడివారు. జవానులకు కల్లు సమృద్ధి. బోగము సానులు రాత్రింబగళ్లు ఆటపాటలతో వారికి వినోదము కలిగించు చుండిరి. సదర్ మొహి తెహెములు దౌరాచే