188
కేమియు లేదు. కారణ మేమన శ్రీయుతులగు కొత్వాలు గారు హిందూ ముసల్మానుల నుభయులను సంతుష్టి చేసి యుభయులకు ప్రీతిపాత్రు లైయున్నారు. కొన్ని మాసముల క్రిందట సగరములో హిందూ ముసల్మానులకు తగపులు జరుగునని యబద్దపు వదంతులు బయలు దేరి యందఱను కలత పెట్టెను. కాని మన కొత్వాలుగారి యుత్కృష్ఠములగు పోలీసు ఏర్పాటుచే నీ భయము లన్నియు నబద్ధములయ్యెను.
సుమారు 20 సంవత్సరముల ముదుక తనములో మన కొత్వాలు గారు శరీరదార్థ్యత కలవారే కాక ఇతరాధికారుల వలెకాక రేయింబవళ్ళును శ్రమించువారు. వీరు కేవలము కచ్చేరీ యందే కాక యితరకాలము "లందును ప్రాతః కాలము నుండి మధ్య రాత్రమువరకు ప్రజల సేవ యందే తమ కాలమును వినియోగించు చున్నారు. ఇట్లు పరిశ్రమచేయు నున్నతోద్యో గినింకొక నిని బహుశ మన రాష్ట్రమందు కానమనిన వింత కాదు.
మన కొత్వాలుగారికన్న 'గొప్పయుద్యోగు లెందరో కలరు. వారికిని ననేకమారులు ఉద్యోగ కాల పరిమితి హెచ్చిం పబడు చుండును. కాని యీ యుద్యోగమునకుండు ప్రాముఖ్య మితరోద్యో గమునకు లేదు. ఇంతియ కాక వీరియందుండు సర్వ