Jump to content

పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

93


ఇంగ్లీషులో ఏ బీ సీడీలు పూర్తి చేసికొని “యెస్ ” “నో' వంటి నాలుగైదు ముక్కలు నేర్చుకొని యుండిరి. కాని ఉద్యోగ ధర్మములో ఊపిరి తిరుగనివారై ఆ కొలది పాటి ముక్కల నెన్నడో మరచి యుండిరి. ఇప్పుడు మరల బుద్ధిపుట్టెను ఒక బీ. ఏ. పండితుని గురువుగా నేర్పాటు చేసికొన్నారు. పాఠములు మొదలు పెట్టినారు.పదముల కాగుణితమ' ( స్పెల్లింగు ) ఉచ్చారణ, అర్థము, వ్రాత పూత శ్రద్ధ రాత్రి కాలములో చెప్పించు కొనుచు తెల్ల వార 4 గంటల కే లేచి గట్టిగా మననము చేసికొనుచు పాఠముల నేర్వ మొదలిడిరి. ఒక నాడు రాత్రి 11 గంటల కాలమప్పుడు తస పాఠములను గట్టిగా కంఠపాఠము చేయుచుండిరి. గది ముందట నేయుండిన ఫహిరా జవాను (పూటకాపరి) యా విపరీత శబ్దములను ధ్వనులను వినినాడు. అదరిపడినాడు ఎన్నడును విననిరీతిగా కొత్త కొత్త .. ధ్వనులతో కొత్వాలు గా రు తనలో తానే వదరుకొను చున్నారు. ఉర్దూ కాదు, ఫార్సీ కాదు, అరబీ కాదు, తెనుగు కాదు, ఏదిన్నీ కాదు. ఇ వేమి ధ్వనులు? ఆయనకు పిచ్చి లేచి యుండును. లేదా దయ్యమైనను పట్టియుండును. అని తర్కించుకొని నిశ్చయించు కొనినాడు. ఆ భటుని కిది నిశ్చయమైన వెంటనే తన తుపాకీని గోడ కానించి పరుగు పరుగున సమీపములోనుండు ఒక సదరు అమీనును సమీపించి కొత్వాలు