30
శ్రీ రా మా య ణ ము
కపులను దెచ్చి లె - క్కగ నెంచి మమ్ము
చపచపఁ జేసి యో - జనలు సేసెదరు !
వా రేల ? మీ రేల ? - వలవదిందొక్క
డేరుపాయగఁబోయి - యెల్లలోకముల
వానరుఁడనియెడు - వాఁడు లేకుండ
జానకీపతిఁ గూడఁ - జంపి వచ్చెదము?
పనిఁగొమ్ము మమ్మ”ని - పదరిపోఁజూచి
దనుజులు తమలోనె - తారుమల్లాడ
నందఱ పదరకుం - డన వారివారి
నందందుఁ గూర్చుండ - నభినయింపుచును 670
గరములఁగన్నుల - క్రందువారించి
సరమాధిపతి విభీ - షణుఁడిట్టు వలికె.
-: విభీషణుడు రావణునికి బుద్ధి చెప్పుట :-
"మాను మాగ్రహము సా - మంబు భేదంబు
దానంబు దండంబు - ధరయేలువారు
తగునెడ నడిపింపఁ - దగుఁగాక మొదటఁ
దగునయ్య ! యగ్నివై - ద్యముఁ జేసినటుల
కడపట పూనించు - కార్యంబు మొదట
నడిపింపఁ జెల్లదు - నయమార్గనిధివి !
దైవోపహతుఁడు మ - త్తస్వాంతుఁ డధమ
జీవనుఁడనువానిఁ - జెనక దండింపఁ 680
దగుఁగాక యప్రమ - త్తస్వాంతుఁడగుచుఁ
బగర గెల్చును దైవ - బలమును గలుగు
శ్రీ రామచంద్రునిఁ - జెనకి రాఁగలరె?