Jump to content

పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

అప్పికట్ల కయిఫియ్యతు


కల౯పాలెం అప్పుడు నెలకు దురుగన్కు ఆవూరి ఉత్తరం గర్వు దగ్గర నుంచ్చి ప్రస్తుత నామంగల ఖాజుపాలెం విస్తరించి అప్పుడు వెంన్నవాడ అనే గ్రామం వుండ్డేది గన్కు ఆంద్దుకింద్ధశివారుగా వుంచ్డేది గన్కు అది గొల౯పాలెం విస్తరించ్చి పశువులమంద్దల గొల౯ మందలు వుండ్డి చాలాపాడి కలిగినంద్ను వెన్న వాడ అనే పేరు వచ్చినది....... ఆ పాలెం దక్షిణం గర్వుకు అడ్డకట్టుగా పోయించ్చి పంట్ట చర్వుగా యేప౯రచి ప్రభుత్వం చేస్తూ వుండ్డగా గజపతి శింహ్వాననస్థూలైన గణపతి మహారాజు నెల్లూరు శీమ ఆఖరు వర్కు దేశములు ఆక్రమించ్చి చోళరాజును పలాయ్నం చేశి రాజ్యం తన వశీకృతం చేశి కొని ప్రభుత్వం చేశే యడల వీరి దగ్గర గోపరాజు రామన్న గారు ప్రధానులై వుండ్డి శాలి వాహనం ౧౦౪ఽ (AD 1145) అగునేటి రక్తాక్షి సంవత్సరం భాద్రపద బహుళ 30 సోమవారం సూర్యోపరాగమందు కృష్ణవేణ్యానదీతీర మంద్దు ధారా గ్రహితం పట్టి సమస్త మయ్ని నియ్యోగులకు వైదీకులకు గ్రామ కరీణీకపు మిరాశీ స్నదులు వ్రాశి యిచ్చే సమయ మందు యీ అల్లూర్కు కరి నర్సరాజు అనే అధిశాఖ నియ్యోగికి యాల్లా ప్రగడ కృష్ణంరాజు అనే ఆరువేల నియ్యోగికి యీ రెండ్డు సంప్రతుల వారికి కరిణికములు నిన౯యిచ్చి కొన్ని దినములు ప్రభుత్వము చేశ్ని మీదట వీరి వంశీకులైన కుమార కాకతీయ రుద్రగజపతి వారి రుద్రగజపతి వారి ప్రభుత్వం ౧౧౯౯ (AD 1277) సంవత్సరంవరకు ప్రభుత్వం జరిగెను. గనుక ఆ దినములలో చలకృత్తి వెంక్కటాద్రి గారికి ఈ శీమ అధికారంలో వుండ్డి వుంన్నారు. గన్కు వారికి స్వప్న లబ్ధంగా శ్రీ లక్ష్మీ నృశింహ్మ స్వామి వారు శేవ యిచ్చి నేను వల్మీకం యంద్దు పాల వృక్షం చాయను గోక్షీరం ఆరగిస్తూ అన్కేవత్సరముల నుంచి యీ ఆశ్రమం యందు మహర్షి వాక్య బోధితుడనై యిక్కడ ఉన్నాను.

నీవు యింతన్నుంచి నాకు ఆలయ స్థళం కట్టి వైభవాదులు జర్పుమని భగవతాజ్ఞ ఆయగన్కు అదే ప్రకారం ఆయ్న వచ్చి ఆ వల్మీకం శోధన చేయించ్చిరి. గన్కు చేశి నంతలో ప్రసంన్ను లైరి గన్కు మహాసంతోషించి నటువంటివాడై ............యీ స్వామి వార్నిడోలాయ మందు వేంచేపుచేశి సకల వుత్సవాదులు చేస్తూ కోవెల కట్టించ్చి స్వామివార్ని పెట్టి సకల వుత్సవాదులు చేస్తూ కయింక్కర్య నిమిత్తమై గ్రామం అగ్రహారం సమపి౯ంచ్చి నారు. యీ స్వామి వారి సన్నిధానమంద్దు ఆచ౯నశాయడాన్కు వధ్యుల తిమ్మప్ప అనే విఘసశుంన్ని నిన౯యించ్చినారు.

ఆయ్న కొంత్తకాలం తిరువారాధన చేశిత్న కామార్తెను సల్లూరు అయ్య వారప్పకు యిచ్చి వివాహంచేశి యీస్థళం _ఆచ౯కత్వమునకు బాధ్యుల చేరినారు. తాదా ప్రభృతి అచ౯కు లైనషువంటి నల్లూరు వారు పరంప్పరా ఆచ౯నచేస్తూ వున్నారు. తదనంత్తరం లాంగ్దూల గజపతిరెడ్లను జయించ్చి దినదిన ప్రవధ౯మానుడై శాలివాహనఁం ౧౨౦౦ శకం (AD 1278) మొదలుకొని గజపతిని జయించ్చి పెద వేమారెడ్డి ప్రభుత్వం లగాయతు వీరభద్ర వేమారెడ్డిగారు ప్రభుత్వం సహోదర పరంప్పరా అరుగురు రెడ్లు శాలివాహనం