Jump to content

అశోకుడు/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

34

అ శో కుఁ డు

శోభితంబగు ధరణితలంబున నుపన సించితిని; అదియే సర్వోత్కృష్ట మృదులాసనము. నేను వినిర్మలస్నిగ్ధ పావన గంగాజలంబులఁ బానము చేసితిని; అదియే సర్వోత్తమ పానీయము. కావున మహాత్ముఁ డగు నా పింగళ వత్స జీవుని వాక్యములు సత్యము లే యైనచో నేనే భవిష్యత్కాలమునందుఁ బితృసింహాసనమును బొందఁగలుగుదును.

మాతాపుత్రుల ప్రియ సంభాషణ మీ విధముగ జరిగినది. అది మొదలుగ వారిహృదయము లాశాన్వితము లగుటచే భవిష్యత్సుఖసమయమునకై వా రిరువురు నెదురు చూచుచుండిరి.


పదియవ ప్రకరణము

జనకుని యాజ్ఞ

మహా రాజగు చంద్రగుప్తుడు తన బుద్ధి బలమునను బాహుబలముననుగూడ మగధ రాజ్యమును జాలదూరము వఱకును వ్యాపింపఁ జేసెను. ఆ కాలమునం దక్షశిల మగధ రాజ్యాంతర్గత మైయుండెను. చంద్రగుప్తుఁడు తా నెంతవఱకుఁదన రాజ్యమును విస్తరింపఁ జేసెనో యంతవఱకుఁ దన సత్య శాసనమునుగూడఁ బ్రసరింపఁ జేసెను - కాని ఎల్ల కాలము నొక్కరీతిగా నుండదు. ఎల్ల దినములు నొక్కలాగున జరుగవు.

పదియవ ప్రకరణము

34

ఇప్పుడు మహా రాజగు బిందుసారుని రాజ్య సమయమున దక్ష శిలయందు విద్రోహములు బయలు వెడలెను. సామంత రాజులు తమలోఁదాము కలహించుచుండిరి. రాజ్యలాల సత్వమే యిందులకుఁ బ్రధాన కారణము—— మఱియుఁ బ్రజా విద్రోహము మఱియొక విధముగ నుండెను. రాజోద్యోగుల దోషములవలనను, వారికఠిన శాసనముల వలనను, దుష్ట

కృత్యములవలనను దూరదృష్టి లేని ప్రజలు విద్రోహు లగు చుండిరి. రాజగు బిందుసారుఁ డీ విద్రోహవా ర్తల నాలకిం చెను. మొట్టమొదట నాతఁడు యువ రాజగు సుషీముని ససైన్యముగ నా స్థలమునకుఁ బంపించెను. ప్రప్రథనుమున బ్రజలందఱును యువరా జగు సుషీ మునింగాంచి యించుక శాంతివహించి యుండిరి. యువ రాజు తమ తమ కష్టములం, గూర్చి యాలకించి యందులకుఁదగిన ప్రతిక్రియల నాచరించునని వారికి మిగుల నమ్మకముకలిగెను. కాని యచిర కాలము నందే వారి కాబ్రమ యంతయు వదలిపోయెను. అప్పుడు ప్రజలందరును యువ రాజు తీవ్రాస్త్రములమూలమునను గఠినశాసనముల మూలమునను దమ్ముదండించుటకై వచ్చియుండేనని భావించుకొనిరి. అందువలన మరల వా రెప్పటివలె నల్లరులం జేయుట కారంభించిరి. యువ రాజు శాంతి స్థాపనమునకై చేసినయాత్ర యీవిధముగ నిష్ఫలమైపోయెను. అందుచే నాతఁడు నిరర్థకముగ స్వదేశమునకు మరలవలసిన వాఁడయ్యెను.

36

అశోకుఁడు

మహారా జగుబిందుసారుఁడు పుత్రముఖంబున నెల్ల సంగతుల నాలకిం చెను. అప్పుడాతఁడు తనతప్పును దా నే తెలిసికొనఁ గలిగెను. తోడనే యామహా రాజకుమారుఁ డగునశోకునిఁ బిలిపించెను. పిమ్మట బిందుసారుఁ డశోకున కెల్ల వృత్తాంతమును జెప్పి యేమేమి చేయవలయునో కూడఁ దెలియఁజేసెను. రాజ్యమున కతిదూరమునఁ బశ్చిమ ప్రాం తమునందు శాంతి స్థాపనము కొఱకు—విద్రోహదమనము కొఱకుఁగాదు—— కుమారున కేమి కావలయునో తండ్రి యన్నియు నోసంగెను-- కేవల మస్త్రములను సైన్యముమాత్ర మాతని కీయ లేదు. అశోకుఁడు తండ్రి యభిప్రాయమును గ్రహియిం చెను. ఆతఁడు నిర్భయుఁడై తక్షశిలకుఁ బ్రయాణమయ్యెను. కొలఁదికాలమునం దేయనోకుఁడు నిరపాయముగఁ దక్షశిలం బ్రవేశించెను. అచ్చటి ప్రజల కందఱకును బ్రేమ పూర్వకముగ దర్శన మొసంగెను; వారికష్టసుఖంబులఁ బరిశీలించెను; వారియభియోగ కారణముల విస్పష్టముగ గ్రహించెను; వారికష్టములయెడల సహానుభూతిని బ్రకటించెను; కష్టని ర్వాపణమునకుఁ దగిన ప్రతి క్రియలం గావించెదనని చెప్పి వారిమనంబుల కూఱట కలిగిం చెను. రాజపుత్రుఁడు శస్త్ర ములనుగాని, సైన్యమునుగాని తీసికొని రాలేదనియుఁ, దమ్ము దండింపవలయు ననును ద్దేశముతో వచ్చిన వాఁడు కాఁడనియుఁ, దమలో శాంతి స్థాపనము చేయుటకే దర్శనమిచ్చి

యుండెననియుఁ బ్రజలందఱును మొట్ట మొదటనే భావించి

పదునొకండవ ప్రకరణము

37

యుండిరి. తరువాత నాతనిదయార్ద్రహృదయమున, దదను కూలవ్యవహారములను గాంచి తమకు క్షేమలాభములం గల్పిం చెద నని చెప్పిన సమాదర శీతలంబు లగు సాంత్వన వచనంబుల నాలకించి ప్రజాగణమంతయు శాంత భావమును వహించి యుండెను. అశోకునియాత్ర సఫలమైనది. పిత్రాజ్ఞాపరి పాలన మైనది.


పదునొకండవ ప్రకరణము


గుణాదరము

అశోకుఁడు తక్ష శిలయందు శాంతి స్థాపనము చేసి రాజధానికి మరలివచ్చెను. పదియాఱేడుల బాలకుఁ డగునా రాజు! కుమారుఁ డొక్కఁడును బోయి ప్రౌడులగువారికిఁగూడ నతి దుష్కరంబగు మహత్కార్యమును సర్వశ్రేయస్సంపన్నముగ నేఱ వేర్చుకొని వచ్చెను. మహారాజగు బిందుసారుఁ డింత, కాలము వఱకును గురూపి యనియు, వికారాకారుఁ డనియుఁ దలంచి యశోకుని జూచుటకుఁ గూడ నసహ్యపడుచుండెను, తక్ష శిలయందు శాంతిని నెలకొల్పుటకై పోయినయశోకున కచ్చట నేవిషమసంకటమున నైనఁబడి మరణించుటయే తటసించిన యెడల నది మహారాజునకు దుఃఖదాయక మే యగునో